చీపురుపల్లిలో వాల్తేర్ వీరయ్య 100డేస్ ఫంక్షన్
Walther Veeraiah 100 Days
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య 100రోజులు వేడుక చేసుకోనుంది. ఈనెల 22న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ వేడుకను జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను వెలువరించింది.ఈ వేడుకకు చిత్ర దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వాల్తేర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ కూడా నటించాడు. ఈ సినిమాకు మంచి అప్లాజ్‌వచ్చింది. చాలాకాలం తర్వాత మరలా చిరంజీవి సినిమా వందరోజులుకు చేరుకోవడం విశేషం. చీపురుపల్లిలో 100రోజులు ఆడడం విశేషం. అందుకే అక్కడ చేయనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు పట్టణంలోని ప్రముఖులతోపాటు చిత్రంలో పనిచేసినవారు హాజరుకానున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటించిన చిత్రం. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు.