సంబంధిత వార్తలు
- Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?
- మల్లిక్ తేజ్‌పై కేసు.. నాపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు..
- మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు
- హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం
- వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు
గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద మహిళా గాయని గంగవ్వ యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్‌తో తన ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నారు. తాజాగా ఆమె సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆమె తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయింది. వీటిని చూసిన నెటిజన్లు.. గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో బిగ్ బాస్ 5 విన్నల్ వీజే సన్నీ ప్రారంభించిన బీబీసీ సెలూన్‌కు గంగవ్వ వెళ్లింది. అక్కడ ఆమె హెయిల్‌ను స్టైటనింగ్ చేయించుకున్నారు. అలానే తన జుట్టుకు నల్లరంగు వేయించుకోవడంతో పాటు కాలికి పెడిక్యూర్ కూడా చేయించుకుంది. గంగవ్వ తన జుట్టును లూజుగా వదిలేసి కొత్త లుక్‌లోకి మారిపోయింది.
తాజా మేకప్‌తో గంగవ్వకు వృద్ధాప్యం కారణంగా ముఖం మీద వచ్చిన మడతలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. గంగవ్వ తాజాగా లుక్‌లోకి మారడంతో అసలు ఆమెకు ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, తాజా లుక్‌లో గంగవ్వ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
