గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (18:45 IST)

07-05-2023 నుంచి 13-05-2023 వరకు మీ వార ఫలితాలు

Weekly Astrology
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలు అధికం. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది. విజ్ఞతతో మెలగండి. ఎవరినీ తక్కువ అంచనాల వేయొద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. బుధవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. ఆప్తులతో సంభాషణ ధైర్యాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శ్రమించినా ఫలితం ఉండదు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. శుక్రవారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు. స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదివారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపుల్లో జాగ్రత్త. సోమవారం నాడు పనులు సాగవు. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వృత్తుల వారికి నిరాశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఆస్తి వివాదాలు జరిలమవుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్త్ర, వస్తుప్రాప్తి ఉన్నాయి. గురువారం నాడు మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. మిత సంభాషణం శ్రేయస్కరం. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పాత మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆర్థికస్థితి నిరాశాజనకం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఈ ప్రతికూలతలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆది, సోమ ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
పట్టింపులకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తులు, కార్మికులకు పనులు లభిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గ్రహంలో మార్పుచేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అన్ని విధాలా అనుకూలమే. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంస్థల స్థాపనలకు అనుకూలం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు ఎవరినీ అతిగా నమ్మవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అవివాహితులకు శుభయోగం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కష్టకాలం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆది, శనివారాల్లో పనులు సాగవు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మస్థైర్యంతో మెలగండి. ఈ ప్రతికూలతలు తాత్కాలికమే. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్ధత మరొకరికి లాభిస్తుంది. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. సోమవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.