శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (13:14 IST)

ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలే పైచేయి

ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 69.27 కాగా.. బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. 
 
జూన్ 2 నుంచి 10 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరు తేదీ మే17గా నిర్ణయించారు. 
 
అలాగే రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ దరఖాస్తుకు మే 13 చివరి తేదీ. పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 
 
జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలను గుర్తించినట్లు మంత్రి బొత్స తెలిపారు. వాటిలో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి బొత్స వివరించారు.