మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. మీ జోక్యం అనివార్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సోమ, మంగళవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. స్థిరచరాస్తుల కోనుగోలులో జాగ్రత్త. తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. కీలక పత్రాలు అందుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.. పొదుపునకు అవకాశం లేదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఓర్పుతో శ్రమించినగాని పనులు కావు. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. గృహనిర్మాణాలకు ప్లాన్ ఆమోదమవుతుంది. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
వాగ్ధాటితో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గురు, శుక్రవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. మీ జోక్యంతో ఒక వ్యవహరం సానుకూలమవుతుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. కృషి ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపాకాభివృద్ధికి మరింత శ్రమించాలి. రైతులకు వాతావరణం అనుకూలిస్తుంది. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ప్రతికూలతలను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరానలోచన మంచిది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పుతో మెలగండి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల సలహా పాటించండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్టను ధీటుగా ఎదుర్కుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. బుధవారం నాడు పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. సంస్థలస్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుక్రవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి అనుకూలదాయకం. కార్మికులు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు అందోళన కలిగిస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ సమస్యలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తుల కలయిక ఊరటనిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంస్థల స్థాపనలకు సమయం కాదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రముఖులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఈ వారం అనుకూలదాయకం. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. సంతానం విదేశీ చదువులపై ఒక నిర్ణయానికి రాగల్గుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సకాంలో పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. కార్మికులకు ఆశాజనకం.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. అందరితో మితంగా సంభాషించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సోమవారం నాడు పనులు, బాధ్యలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.