సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By ఠాగూర్

11-06-2023 నుంచి 17-06-2023 వరకు మీ వార రాశిఫలితాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహమార్పు మంచి ఫలితమిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ప్రతికూలతలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. విత్తన వ్యాపారులకు చికాకులు అధికం. వ్యవసాయ కార్మికులకు పనులు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. బుధవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహ వాస్తుదోష నివారణ సత్ఫలితాలనిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పత్రాల రెన్యువ‌ల్‌‍లో మెళకువ వహించండి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆదివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సన్నిహితులు వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. చేతి వృత్తుల వారికి సామాన్యం. వ్యవసాయ రంగాల వారికి అనుకూలదాయకం. విత్తన, ఎరువుల వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ బాగుంటుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిరుత్సాం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అధికం, అవసరాలకు ధనం అందుతుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. త్వరలో పరిస్థితులు అనుకూలిసాయి. మంగళవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు సమయం కాదు. భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. అవివాహితులకు శుభయోగం. బుధవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుక్ర, శనివారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆదివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.