శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (21:05 IST)

డబ్ల్యూటీసీ ఫైనల్.. బాల్ ట్యాంపరింగ్ కలకలం.. బంతి ఆకారం మారింది!

pink ball
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేగింది. టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పూజారాలు అవుట్ చేసేందుకు ఆసీస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
ఆసీస్ ఆటగాళ్లు 16, 18వ ఓవర్లలో బాల్ టాంపరింగ్ చేయడం కనిపించిందని తెలిపాడు. మైదానంలోని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేసినట్లు బాసిత్ తెలిపాడు. 
 
ఆసీస్ బాల్ టాంపరింగ్ టీవీలో స్పష్టంగా కనిపించిందని.. కానీ మైదానంలో ఉన్న అంపైర్లకు, కామెంటరీ బాక్సులో వున్నవారికి మాత్రం అది కనిపించలేదన్నాడు.