గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (09:53 IST)

పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలి.. సర్జికల్ దాడులు చేయాలి

భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలని పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
మాదకద్రవ్యాల అక్రమ తరలింపు కట్టడికి పంజాబ్ పోలీసులు కేంద్ర బలగాల సాయంతో చేపడుతున్న చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
డ్రగ్స్ సమస్యను నివారించేందుకు బీఎస్ఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. భారత్‌లోకి మాదకద్రవ్యాలు చొప్పిస్తూ పాకిస్థాన్ భారత్‌తో పైకి కనిపించని యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు.
 
భారత్‌తో నేరుగా తలపడలేకే ఈ చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. భావితరాలు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఎలాగైనా సరే అడ్డుకోవాలని అన్నారు.