గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (23:12 IST)

పాకిస్థానీ కుర్రాడి హెలికాప్టర్ షాట్లు.. వీడియో వైరల్

pakistan boy
pakistan boy
ఒక పాకిస్థానీ కుర్రాడి అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆన్‌లైన్‌ను షేక్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను రజా మహర్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 
 
ఈ వీడియోలో, బాలుడు ఒక్క బంతిని కూడా వదలకుండా కొట్టాడు. ఆ బంతులు కాస్త ఫోర్లుగా మారాయి. ఇందులో కొన్ని హెలికాప్టర్ షాట్‌లు కూడా ఉన్నాయి.ఈ వీడియో చూసిన జనాలు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "పవర్ హిట్టింగ్" పేరుతో ఈ వీడియో 21 మిలియన్ల వీక్షణలు, 1.4 మిలియన్ లైక్‌లను పొందింది.
 
నెటిజన్ల ఈ వీడియో పట్ల వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టులో ర్యాన్ బరాక్‌ను భర్తీ చేయవచ్చని కొందరు సూచించారు. మరొకరు సూర్యను పోలి ఉన్నారని అన్నారు.