1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మే 2023 (10:12 IST)

నడక ద్వారా విద్యుత్‌‌ను ఉత్పత్తి చేసే బూట్‌లను అభివృద్ధి చేశాడు..

Bengal Boy
Bengal Boy
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి నడక ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగిన బూట్‌లను అభివృద్ధి చేశాడు. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చందన్‌నగర్‌రు చెందిన విద్యార్థి ఈ ఘనత సాధించాడు. వివరాల్లోకి వెళితే.. సౌవిక్ సేథ్ షూలను GPS ట్రాకింగ్, కెమెరాతో అమర్చాడు. వాటిని బహుళ-ఫంక్షనల్ పరికరంగా మార్చాడు. 
 
ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు సెల్‌ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చని సేథ్ పేర్కొన్నాడు. తమ కుమారుడు ఎల్లప్పుడూ కొత్త విషయాలను కనిపెట్టడంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడని సేథ్ తల్లిదండ్రులు చెప్పారు. 
 
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెరీర్‌ను కొనసాగించాలనే తన లక్ష్యం కోసం అతను ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.