ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (11:59 IST)

రచ్చ రంబోలా చేస్తున్న జై బాలయ్య : 'వీరసింహారెడ్డి' నుంచి ఫస్ట్ సింగిల్

veera simha reddy
హీరో బాలకృష్ణ నటించిన తాజా చిత్ర "వీరసింహా రెడ్డి". ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. 'రాజసం నీ ఇంటిపేరు.. పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ సాగే ఈ పాట అద్యంతం చాలా పవర్‌ఫుల్‌గా చిత్రకరించారు. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఎస్ఎస్. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు థమన్ అద్భుతంగా ట్యూన్స్ కట్టారు. ఫలితంగా అదిరిపోయే రేంజ్‌లో ఈ పాట ఉంది. 
 
రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా, కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్‌లు కీలకపాత్రను పోషించారు.