గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (16:41 IST)

లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు

Nenevaru
Nenevaru
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా... నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం 'నేనెవరు'. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటించారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "నేనెవరు" చిత్రాన్ని ఈనెల 25 (నవంబర్25) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోందని, లవ్ - సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెలిపారు. హీరో కోలా బాలకృష్ణ, దర్శకుడు నిర్ణయ్, సంగీత దర్శకుడు ఆర్.జి.సారథిలకు చాలా మంచి పేరు తెస్తుందని నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు పేర్కొన్నారు.
 
ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం "నేనెవరు" కావడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఎడిటింగ్: కోలా భాస్కర్   ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి