శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (11:51 IST)

శ్రీలంక చెత్త రికార్డ్... భారత్ అదుర్స్

Sri lanka
శ్రీలంకపై వన్డేలో భారత్ కు ఇది 95వ గెలుపును నమోదు చేసుకుంది. కోల్ కతాలో జరిగిన వన్డేలో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఈ విజయంతో భారత్ ఒక ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 
 
అయితే శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలను నమోదు చేసిన దేశంగా భారత్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. శ్రీలంక వన్డేల్లో భారత్ కు ఇది 95వ విజయం. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట వుంది. కివీస్ పై ఆస్ట్రేలియా 95 వన్డేల్లో గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇంకో వైపు గురువారం వన్డే ఓటమితో శ్రీలంక ఒక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధి ఓటమిలను మూటకట్టుకున్న జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 437 వన్డే మ్యాచుల్లో శ్రీలంక ఓడిపోయింది. ట్వంటీ-20ల్లో 94 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచుల్లో ఓడిపోయిన అప్రతిష్టను మూటకట్టుకుంది.