బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (10:54 IST)

నేటి నుంచి భారత్- శ్రీలంక వన్డే సిరీస్.. బుమ్రా ఔట్

bumrah
భారత్ - శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభంకానుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతి వేదికగా ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్.. వన్డే సిరీస్ కోసం ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. పైగా, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పరితపిస్తుంది. జట్టులోకి కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాటర్ కేఎల్ రాహుల్‌లు చేరడంతో జట్టు పటిష్టంగా మారింది. స్వదేశంలో జరిగే ప్రపంచ కప్ పోటీల్లో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్ళతో పాటు పలువురు సీనియర్లకు కూడా ఈసిరీస్ అత్యంత కీలకంకానుంది. 
 
అయితే, భారత ఫాస్ట బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న బుమ్రా ఫిట్నెస్‌పై జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్.ఏ.సి) సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ప్రాక్టీస్ సెషన్‌లో కాస్త అసౌకర్యంగా కనిపించడంతో జట్టులోకి ఎంపిక చేయలేదు. అదేసమయంలో బుమ్రా స్థానంలో కూడా ఇతర ఆటగాడిని ఎంపిక చేయలేదు. అయితే, బుమ్రా మరో నెల రోజుల్లో పూర్తిగా కోలుకుంటే మాత్రం తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ మధ్యలో జట్టుతో పాటు చేరే అవకాశం కనిపిస్తుంది. 
 
భారత జట్టు : రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.