ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

టీ20 ప్రపంచ కప్‌కు దూరమైన పేసర్ బుమ్రా

bumhrah
టీ20 ప్రపంచ కప్ టోర్నీకి ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేస్ బౌలర్ బుమ్రా జట్టు నుంచి తప్పుకున్నాడు. వెన్నునొప్పి తగ్గకపోవడంతో వైద్యులు మరికొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. దీంతో బుమ్రాను టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 
 
కీలకమైన ప్రపంచ కప్‌కు బుమ్రా వంటి బౌలర్ లేకపోవడంతో జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తుంది. టోర్నీలోపు కోలుకుంటే మాత్రం జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, గాయంపై తుది నివేదిక వచ్చేంతక వరకు వేచిచూడకుండా, తుది నిర్ణయం తీసుకుంది 
 
గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతూ వచ్చిన బుమ్రా జట్టుకు దూరం కాలేదని జాతీయ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించారు. కానీ, బీసీసీఐ మాత్రం సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. 
 
మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై ఈ నెల 16వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్ తన ప్రారంభ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన జరుగనుంది. పేస్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రా ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.