సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి

శ్రీలంకతో వన్డే సిరీస్‌.. ఫిటినెస్ లేమితో బుమ్రా అవుట్

భారత పేస్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ లేమి కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టు (బీసీసీఐ) గతంలో బుమ్రాను రీకాల్‌ చేసింది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో భారత్ తరఫున ఆడాడు. 
 
అప్పటి నుంచి, అతను ఆసియా కప్, T20 ప్రపంచ కప్‌తో సహా దేశం కోసం చాలా పెద్ద ఈవెంట్‌లలో ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక సిరీస్ కోసం బుమ్రా తిరిగి భారత జట్టులోకి వస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే పేసర్ పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి రావడానికి కొంచెం సమయం పడుతుందని తెలుస్తోంది.
 
శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు ముందు గౌహతిలో జట్టులో చేరేందుకు సిద్ధమైన బుమ్రా బౌలింగ్‌లో పుంజుకోవడానికి మరికొంత సమయం కావాలి. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.