క్రెస్ట్‌చర్చ్‌లో థర్డ్ వన్డే మ్యాచ్ : భారత్ బ్యాటింగ్
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, బుధవారం చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ జట్టుతో తలపడుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, అక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్లు తేడాతో గెలుపొందగా, హామిల్టన్ వేదికగా జరగాల్సిన రెండు వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో బుధవారం జరిగే థర్డ్ వన్డే మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కుంచుకోవాలని ఆతిథ్య కివీస్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ జట్టులో మాత్రం బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి దిగుతున్నారు. కాగా, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌న భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.