గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (10:16 IST)

హామిల్టన్ వన్డే మ్యాచ్ నిర్వహణకు అడ్డుపడిన వరుణుడు

cricket stadium
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, టీ20 సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత ప్రారంభమైన వన్డే సిరీస్‌లో ఇటీవల అక్లాండ్ వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ ఏడు వికెట్లు తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో రెండో వన్డే మ్యాచ్ ఆదివారం ఉదయం హామిల్టన్ వేదికగా ప్రారంభమైంది. అయితే, వరుణ దేవుడు అడ్డుతగలడంతో మ్యాచ్ 4.5 ఓవర్ల వద్ద ఆగిపోయింది. ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌‍లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ (2), శుభమన్ గిల్ (19)లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారీ వర్షం కుమ్మేసింది. దీంతో స్టేడియం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
 
వన్డే సిరీస్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‍‌లో నెగ్గి తీరాల్సివుంది. అయితే, ఈ మ్యాచ్ మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగే సూచనలు కనిపించడంలేదు. హామిల్టన్‌లో ఈ రోజు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం మేరకు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ జరగడం అనుమానాస్పదంగా మారింది.