శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (18:03 IST)

నన్ను చూసి కుక్క మొరిగింది.. అందుకే యువతి హత్య

Black Dogs
24 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ హత్య కేసులో అదుపులోకి తీసుకున్న భారత సంతతికి చెందిన రాజ్‌విందర్ సింగ్.. ఢిల్లీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌లో యువతి పెంపుడు కుక్క తనను చూసి మొరగడంతో గొడవ జరిగిందన్నాడు. 
 
దీంతో ఆస్ట్రేలియన్ యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. యువతిని అనేకసార్లు కత్తితో పొడిచి, ఆమె మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ కుక్కను బంధించి ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. 
 
2018లో ఈ హత్య జరిగింది. అయితే రెండు రోజుల ముందు భారత్‌కు తిరిగి వచ్చిన రాజ్‌విందర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ రివార్డు ఉందని పోలీసులు చెప్పారు.