శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (20:23 IST)

అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. విషయం ఏంటో తెలుసా?

Amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో ఫుడ్ డెలివరీ వ్యాపారానికి గండి కొట్టాలనుకుంటున్నట్లు ప్రకటించింది. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతు పోటీపడలేకపోతున్నట్లు అమేజాన్ ప్రకటించింది. 
 
కరోనా కాలంలో కస్టమర్ల డిమాండ్ కొరకు అమేజాన్ భారత్‌లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తద్వారా అమేజాన్ ఫుడ్ సేవలను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
ప్రస్తుతం అమేజాన్ ఫుడ్ సర్వీస్ ఆగిపోయింది. డిసెంబర్ 29 వరకు రెస్టారెంట్లతో డీల్ కొనసాగుతుంది. అప్పటివరకు అమేజాన్ ఫుడ్ బుక్ చేసుకున్న ఆర్డర్లను అందిస్తున్నట్లు అమేజాన్ పేర్కొంది. లాభాలు లేక అమేజాన్ ఫుడ్ సర్వీసులను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సంస్థ తెలిపింది.