అమెజాన్ ఆదరణతో గంధర్వ దర్శకుడు అప్సర్ మరో చిత్రానికి సిద్ధం
Sandeep Madhav
ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటీ , ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా సాగింది , పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ , అసలు ప్రపంచం ఎలా నమ్మింది అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారి స్పాన్ ఉన్న కథ ఎంచుకున్నాడు . దానికి తగ్గట్టుగానే మిగతా తారాగణం నటించారు. జూలై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన గంధర్వ మంచి మార్కులే కొట్టేసింది .
అయితే తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సైతం తన హవా కొనసాగిస్తుంది . అది చూసిన నిర్మాణ సంస్థ వెంటనే ఈ చిత్రాన్ని అటు తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ నెల ఆఖరున రిలీజ్ చేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా కొత్త కథ తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అప్సర్ , ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ కోసం కథ రెడి చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి , సినిమాటోగ్రఫి : జవహర్ రెడ్డి, ఎడిటర్ : బసవా పైడి రెడ్డి , ఆర్ట్ డైరెక్టర్ : మూర్తి కాగా , షకీల్ సంగీతాన్ని అందించారు .

