సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (15:40 IST)

ERROR500 టీజర్ ఆవిష్క‌రించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Thalasani Srinivas Yadav, Jaswant Padala, Sandeep
Thalasani Srinivas Yadav, Jaswant Padala, Sandeep
మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో సాందీప్ మైత్రేయ ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ERROR500''. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చిత్రం టీజర్ ని లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..మైత్రేయ మోషన్ పిక్చర్స్యు నిర్మిస్తున్న  'ERROR500'' చిత్రం టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ERROR500 యూనిట్ చాలా ప్యాషన్ ఈ సినిమా చేశారు. ఈ సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి'' అని కోరారు.
 
జస్వంత్ మాట్లాడుతూ, మా డెబ్యు మూవీకి తలసాని శ్రీనివాస్  టీజర్ లాంచ్ చేయడం గొప్ప ఆశీర్వదంగా అనిపించింది.  'ERROR500' అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసిన త్రేయ మోషన్ పిక్చర్స్యు కి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తోంది'' అన్నారు
 
దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ.. 'ERROR500'' దర్శకుడిగా నా తొలి చిత్రం. మంత్రివర్యులు  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ERROR500' మంచి ఎంటర్ టైనర్. బిగ్ బాస్ ఫేం జస్వంత్ ని మేము లాంచ్ చేయడం ఆనందంగా వుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు.
 
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీరామ్ & ప్రశాంత్ మన్నె సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.