డీజే టిల్లు నేహా శెట్టి బెడ్ రూమ్ అందాలు సీక్వెల్‌కు రెడీనా!
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి దీపావళి సందర్భంగా ఇలా బెడ్‌రూమ్‌లో ఫొటో సెషన్ చేసి అభిమానులను అరిస్తోంది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ చిత్రం రూపొందుతోంది. ఇందులో కథానాయికగా అనుపమ నటిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సీక్వెల్‌లో ఓ కీలక పాత్ర నేహాశెట్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే దీపావళినాడు తన ఆనందాన్ని ఇలా అందాలతో వ్యక్తం చేసినట్లు నెటిజన్లు తెలియజేస్తున్నారు.
నేహా శెట్టి మోడల్. ఆమె 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించింది. మెహబూబా, గల్లీ రౌడీ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అనుకున్నంత పేరు రాలేదు.
ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాకూడా చేయనున్నట్లు తెలుస్తోంది. నేహా నటనతోపాటు గ్లామర్ పాత్రలు పోషించడానికి సిద్ధమేనని ప్రకటించింది. కథాపరంగా వచ్చే సన్నివేశాలు, దర్శకుడు, నిర్మాణ సంస్థలు నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తానని తెలిపింది.
హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన డీజే టిల్లులో రాధిక పాత్రలో ప్రేక్షకులను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటోంది.