హీరో హావిష్‌తో ఎస్ బాస్ అనిపిస్తున్న బాగమతి దర్శకుడు అశోక్
Ashok, Havish
దర్శకుడు అశోక్ భాగమతి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కాబోతోంది. రవితేజ ఖిలాడి సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే డీజే టిల్లు కెమెరామెన్ సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
