గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (13:01 IST)

జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో అమెజాన్ - హాట్‌స్టార్ ఉచితం

jioservice
దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న జియో తన వినియోగదారుల కోసం వివిధ రకాలైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆకర్షణీయమైన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. వీటితో పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీలను ఉచితంగా అందజేయనుంది. 
 
అయితే, ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా లభించే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే ఆకర్షణీయంగానే ఉన్నాయి. 
 
పోస్ట్ పెయిడ్‌లో ఆరంభ ప్లాన్ ధర రూ.399గా ఉంది. దీన్ని ఎంచుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా వీక్షించవచ్చు. నెలకు 75 జీబీ డేటా ఉచితంగా పొందొచ్చు. అంటే రోజుకు 2.5 జీబీ చొప్పున డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే, అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. కేవలం నెట్ ఫ్లిక్స్ వరకే కాకుండా అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సేవలను కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా పొందే అవకాశం ఉంది. 
 
ఇకపోతే, రూ.599 నెలవారి ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుంది. కాల్స్ ఉచితం, రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అమెజాన్, డిస్నీ, నెట్ ఫ్లిక్స్‌లు ఉచితంగా పొందవచ్చు. అలాగే, రూ.799 ప్లాన్‌తో 150 జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఇక మరింత డేటా కోరుకునేవారికి రూ.999, రూ.1499 ప్లాన్లు కూడా ఉన్నాయి.