గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:08 IST)

రిలయన్స్ జియో నుంచి సూపర్ ఆఫర్స్

రిలయన్స్ జియో నుంచి సూపర్ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా జియో నుంచి రూ. 91 ప్లాన్ ప్రారంభమవుతుంది. జియో ఫోన్ యొక్క రూ. 91 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. 
 
ప్లాన్‌లో, కస్టమర్‌లకు అపరిమిత కాలింగ్, 50 ఎస్ఎస్ఎం, మొత్తం 3జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 100 ఎంబీ డేటా అన్నమాట. 
 
అలాగే, జియో టీవీ, జియో సినిమా,  జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్  జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది.