గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (11:49 IST)

నెల రోజులు వ్యాలిడిటీ.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో సరిగ్గా నెల రోజులు వ్యాలిడిటీ ఉండేలా ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలలో 30 రోజులు ఉన్నా లేదా 31 రోజులు ఉన్నా, రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఆ నెలంతా జియో అవుట్‌ గోయింగ్ సర్వీస్‌లు అందుతాయి.

అంటే ఒక నెలలో 1 వ తేదీన రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే నెల 1 వ తేదీ వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.
 
దీంతో కస్టమర్లు ఏడాదిలో 13 సార్లు నెలవారి ప్లాన్‌లతో రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రూ. 259 రీఛార్జ్‌ ప్లాన్‌తో ప్రతి రోజు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇతర బెనిఫిట్స్ వస్తాయి. 
 
ఇతర జియో ప్లాన్స్‌లానే ఈ ప్లాన్‌ను కూడా చాలా సార్లు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒక ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయితే క్యూలో ఉన్న తర్వాతి ప్లాన్ యాక్టివ్ అవుతుంది.