గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:49 IST)

జియో సర్వర్ డౌన్ - అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ

ముంబైలోని రిలయన్స్ జియో కస్టమర్లు సర్వర్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కాల్స్ రావట్లేదని, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లట్లేదని శనివారం జియోకు నివేదించారు. 
 
రిలయన్స్ జియో వినియోగదారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫిర్యాదుల ప్రకారం, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
 
నెట్‌వర్క్ సమస్యపై ఫిర్యాదు చేస్తున్న ట్విట్టర్ వినియోగదారుకు రిలయన్స్ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ అయిన జియోకేర్ స్పందిస్తూ, జియో ఇలా రాసింది, "హాయ్! మీరు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం లేదా మీ మొబైల్ కనెక్షన్‌లో కాల్‌లు చేయడం లేదా స్వీకరించడం వంటి అడపాదడపా సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది తాత్కాలికం మా బృందం దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది" అంటూ పేర్కొంది. 
 
ప్రస్తుతం జియో నెట్ వర్కర్ డౌన్‌పై పలు మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో ఒకటే ఈ ఫోటోలో వున్నది. ఈ ఫోటోకు ఓ నెటిజన్ ప్లీజ్ వెయిట్ అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ అంటూ సెటైర్లు పేల్చాడు.