సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 జులై 2022 (16:36 IST)

సందీప్ క‌ళ్ళ‌ను చూడ‌గానే చిరంజీవి గుర్తుకువ‌చ్చారు- ముర‌ళీమోహ‌న్‌

Gandharva pre release
Gandharva pre release
సందీప్ మాధ‌వ్‌, గాయ్ర‌తి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం `గంధ‌ర్వ‌`. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ స‌హ‌కారంతో యాక్ష‌న్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది. సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో అప్స‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని అబ్దుల్‌ నిర్మించారు. సెన్సార్ పూర్త‌యి జూలై8న విడుద‌ల కాబోతుంది. ఈ  సంద‌ర్భంగా మంగ‌ళ‌శారం రాత్రి హైద‌రాబాద్‌లో  గంధ‌ర్వ ప్రీరిలీజ్ వేడుక జ‌రిగింది. 
 
ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ, నాకు చాలా సంతోషంగా వుంది. గంధ‌ర్వ టైటిల్లోనే  ప‌రిమ‌ళం క‌నిపించింది. యువ‌కులంతా చేసిన సినిమా ఇది. సురేష్ కొండేటి కొన్నాడ‌న‌గానే మ‌రింత సంతోషం వేసింది. ఆయ‌న‌ది గోల్డెన్ హ్యాండ్‌. రిపోర్ట్‌గా వ‌చ్చి సంతోషం మ్యాగ‌జైన్ స్థాపించ‌డ‌మేకాకుండా సౌత్‌లోని నాలుగు భాష‌ల్లోనూ సినిమా అవార్డులు ఇస్తున్నారు. అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర ప్ర‌భుత్వాలు కూడా చేయ‌ని ప‌ని చేస్తున్నారు. అలాంటి గోల్డెన్ హ్యాండ్ గంధ‌ర్వ తీసుకున్నారు. ఇక సందీప్‌ను చూడ‌గానే నేను చిరంజీవిగారితో `మ‌నఊరి పాండవులు` చేశాను. చిరంజీవిగారు క‌న్నెర చేస్తే ఎలా వుంటుందో సందీప్ క‌ళ్ళ‌ను చూస్తే అలా అనిపించింది. ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ వుంది. సీనియ‌ర్ న‌టుడు కె.కె. శ‌ర్మ‌గారి మ‌న‌వుడు అని తెలిశాక మ‌రింత ఆనందమేసింది. ఇక సినిమాలో పాట‌లు ష‌కీల్ బాగా చేశారు. అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వం చాలా బాగుంది. మంచి సినిమా తీశారు. ముందుముందు మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. సాయికుమార్ నేను క‌లిసి దేవుడు చేసిన పెళ్లి సినిమాతో కెరీర్ ప్రారంభించాం. సురేష్ కూడా న‌టించాడు. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
 
హీరో సందీప్ మాధ‌వ్ మాట్లాడుతూ, సాయికుమార్ రాక‌తో మా సినిమా హైప్ పెరిగింది. బాబూమోహ‌న్‌గారితో న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. క‌థ‌ను న‌మ్మి, న‌న్ను న‌మ్మి సుభానిగారు పెట్టుబ‌డి పెట్టారు. అప్స‌ర్ చెప్పిన క‌థ చాలా వినూత్నంగా అనిపించింది. గాయ‌త్రీ సురేష్ అందంతోపాటు అభిన‌యం చాలా బాగుంది. ఆమె చేసిన ఇట‌ర్‌వెల్ సీన్ హైలైట్ అవుతుంది. సురేష్ కొండేటిటారు సినిమా తీసుకున్నార‌న‌గానే చాలా సంతోషంగా అనిపించింది. ఆంధ్ర‌, తెలంగాణ‌లో 500 థియేట‌ర్ల‌లో రాబోతుంది. అంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు అప్స‌ర్ మాట్లాడుతూ, ఊరి చివ‌ర యుద్ధం చేసేవాడు రైతు. స‌రిహ‌ద్దుల్లో యుద్ధం చేసేవాడు సైనికుడు. ప్ర‌తి విష‌యంలో గెల‌వాలంటే మ‌నం యుద్ధం చేయాలి. అలా త‌ల్లిదండ్రులు, మ‌న‌మూ కూడా పోరాడుతూనే వుంటాము. అలాంటి యుద్ధం పూర్తి చేయ‌డానికి గంధ‌ర్వ కార‌ణ‌మైంది. ఇందుకు కెమెరా జ‌వ‌హ‌ర్‌నుంచి అంద‌రూ టెక్నీషియ‌న్లు  సైనికుల్లా అండ‌గా నిలిచారు. నిత్య య‌వ్వ‌నుడు అంటే గంధ‌ర్వుడు. అలా మా సినిమాకు బాణీలు చేసిన ష‌కీల్ ను అభినందిస్తున్నాను. క్ల‌యిమాక్స్‌లో స‌రైన క్లూ కోసం ఆలోచిస్తుండ‌గా అదికూడా దొరికింది. ష‌కీల్ ద్వారా సందీప్ నాకు దొరికాడు. గాయ‌త్రీ సురేష్ న‌ట‌న చూస్తే సావిత్రి గుర్తుకు వ‌స్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ను శీత‌ల్ పోషించింది. సాయికుమార్‌, బాబూమోహ‌న్‌, పోసాని, వీర‌శంక‌ర్‌ ఇలా సీనియ‌ర్లు నాకు స‌హ‌క‌రించారు. నేను సినిమాకు రావ‌డానికి పూరీ, ఆర్‌జీవి, రాజ‌మౌళి వంటివారే స్పూర్తి. ఇక అన్ని విధాలా నా వెన‌క నిల‌బ‌డిన ఆయుధ‌మే నా కుటుంబం. ఈ సినిమా స‌క్సెస్ అయి మ‌రిన్ని సినిమాలు చేసేలా ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.
 
సీనియ‌ర్ న‌టుడు సురేష్ మాట్లాడుతూ, ష‌కీల్ రీరికార్డింగ్‌ను ఇళ‌యారాజ‌ను ఫాలో చేశాను అన్నాడు. ఇళ‌య‌రాజాగారు ఆర్‌.ఆర్‌.చేస్తే డైలాగ్‌ను దాటి వెళ్ళ‌డు. ఆయ‌న సినిమా వ‌ల్లే నేను వెలుగులోకి వ‌చ్చాను. విజువ‌ల్స్ బాగా చూపించారు. అప్స‌ర్ మంచి పాత్ర వుంద‌ని ఫోన్ చేస్తే పాయింట్ అడిగాను. ఇది కాన్సెప్ట్ ఫిలిం అంటూ రెండు లైన్లు చెప్పాడు. నేను మెస్మ‌రైజ్ అయ్యాను. వెంట‌నే చేస్తాన‌న్నాను. ఇక సాయికుమార్‌, బాబూమోహ‌న్ వంటి వారితో న‌టించ‌డం సంతోషంగా వుంది. సందీప్ ఈజీగా చేసేశాడు. ప్ర‌తి షాట్‌కు న్యాయం చేశాడు. ఈ సినిమా టీమ్ కోస‌మే హిట్ కావాలి. ఈ సినిమా ఆర్మీవారు తీసిన క‌థ‌. ఇది ఆర్మీవారికి నివాళిగా వుంటుంద‌ని భావిస్తున్నాను. ఇలాంటి సినిమాకు సురేష్ కొండేటి ప‌బ్లిసిటీ చేయ‌డం అభినంద‌నీయం. 500 థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కావ‌డం చాలా ల‌క్కీగా భావిస్తున్నాను అన్నారు. 
 
యఎస్‌.కె. ఫిలిమ్స్  అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, నేను చేసిన ఎన్నో సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే గంధ‌ర్వ‌ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. యఎస్‌.కె. ఫిలిమ్స్ ద్వారా ప్రేమిస్తే, జ‌ర్నీ వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు విడుద‌ల చేశాం. నిర్మాత‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లు వ‌చ్చాయి. పంపిణీదారుడిగా హిట్లు కొట్టాను. శాండీ (సందీప్ మాధ‌వ్‌) చేసిన వంగ‌వీటి, జార్జిరెడ్డి చూశాను. ఆ సినిమాల త‌ర్వాత ఏ సినిమాలు ఒప్పుకోకుండా హ్యాట్రిక్ కోసం ఆగి ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసిన వెంట‌నే డిస్ట్రిబ్యూట్ చేశాను. క‌థ చాలా కొత్త‌గా వుంటుంది. నాకు ఈ సినిమా ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇందులో సాయికుమార్‌, బాబూమోహ‌న్‌, సురేష్ వంటి సీనియ‌ర్లు న‌టించారు. గాయ‌త్రీ న‌ట‌న అద్భుతంగా వుంది. గ్లామ‌ర్ డాల్‌గా శీత‌ల్ చేసింది. తెలుగులో ఇంత‌వ‌ర‌కు రాని క‌థను న‌మ్ముకుని అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం హ్యాట్సాప్‌గా అనిపించింది. జూలై 8న విడుద‌ల‌వుతుంది. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లకు జ‌నాలు రారు అనుకుంటుండ‌గా, మా సినిమాకు ఏషియ‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్, వరంగ‌ల్‌శ్రీ‌ను వంటివారు ప్రోత్సాహం మ‌రువ‌లేనిది. మంచి థియేట‌ర్లు ఇచ్చిన గీత ఆర్ట్స్‌వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ప్రేక్ష‌కులు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.