డిసెంబరులో వచ్చే బ్యాంకు సెలవులు ఇవే...
దేశంలోని బ్యాంకులకు డిసెంబరు నెలలో ఏకంగా సగం రోజుల పాటు సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలు కలుపుకుంటే మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆ సెలవుల జాబితాను భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా ప్రకటించింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల మేరకు ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే,
డిసెంబరు 3వ తేదీన ఫీస్ట్ ఆఫ్ సెంట్ జేవియర్స్, గోవాలో బ్యాంకులకు సెలవు
డిసెంబరు 12న పా టోగాన్ నెంగ్ మింజా సంగ్మ, షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబరు 19న గోవా లిబరేషన్ డే, గోవాలో సెలవు
డిసెంబరు 24న క్రిస్మస్ ఈవ్, షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబరు 26న క్రిస్మస్ సెలెబ్రేషన్స్, లూసాంగ్, నామ్ సాంగ్, ఐజాల్, గ్యాంగ్ టక్, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు.
డిసెంబరు 29న గురు గోబింద్ సింగ్ జయంతి, చంఢీఘడ్‌లో సెలవు.
డిసెంబరు 31న న్యూ ఇయర్ ఈవ్, ఐజాల్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబరు నెలలో వచ్చే సాధారణ సెలవులు.
డిసెంబరు 4 - ఆదివారం
డిసెంబరు 10 - రెండో శనివారం
డిసెంబరు 11 - ఆదివారం
డిసెంబరు 18 - ఆదివారం
డిసెంబరు 24 - నాలుగో శనివారం
డిసెంబరు 25 - క్రిస్మస్, ఆదివారం