గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (15:35 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : దీపక్ చాహర్ దూరం.. దూరం..

deepak chahar
ఈ నెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుతో తలపుతుంది. అయితే, ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. 
 
ఇప్పటికేవ గాయాలతో పాటు వివిధ కారణాల రీత్యా జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు పేస్ బుమ్రా దూరమయ్యారు. ఇపుడ మరో ఆల్‌రౌండర్  దీపక్ చాహర్ కూడా గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. కనీసం టీ20 ప్రపంచకప్‌ నాటికైనా కోలుకుంటాడని భావించినప్పటికీ.. ఆ అవకాశం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దీపక్ చాహర్‌ స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే. 
 
బుమ్రా, దీపక్‌ చాహర్‌ స్థానాల్లో మహమ్మద్‌ షమీతోపాటు సిరాజ్‌ భారత జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. అయితే, వీరిద్దరిలో ఎవరు ప్రధాన జట్టులోకి వస్తారనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే వారిద్దరే కాకుండా శార్దూల్‌ ఠాకూర్‌ను కూడా ఆస్ట్రేలియాకు పంపే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ, 'చాహర్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి సమయం పట్టేలా ఉంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టినట్లుంది. అందుకే, బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్లను ఆస్ట్రేలియాకు పంపించనుంది. షమీ, మహమ్మద్ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ వెళ్తారు' అని పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.