గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (22:12 IST)

శ్రీలంకతో రెండో వన్డే.. 4 వికెట్ల తేడాతో విజయం

team india
శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఫెర్నాండో 50 పరుగులు, మెండిస్ 34 పరుగులు, దునిత్ 32 పరుగులు చేశారు. 
 
తద్వారా శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి భారత జట్టుకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు తరఫున సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం కేఎల్ రాహుల్ 64 పరుగులు, పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 43.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.