పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలు.. భారత్‌లో కలిపేయాలని..?
పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రజలు రోడ్డెక్కుతున్నారు. పాకిస్థాన్‌పై పెద్ద ఎత్తున నిరసనలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ సర్కారు విధానాలు తమ పట్ల వివక్షాపూరితంగా వున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఫైర్ అవుతున్నారు.
అంతేగాకుండా.. తమ రాష్ట్రాన్ని భారత్‌తో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడఖ్‌లో భారత్‌తో తమను కలిపేయాలని స్థానిక ప్రజలు కోరుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా ఇదే వాదన చేస్తున్నారు. పాకిస్తాన్ భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పాక్ సైనికులు చేస్తున్న అరాచకాల తెర దించాలని డిమాండ్ చేశారు.