సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (10:31 IST)

కర్నాటకలో ఇంటర్ సిటీ హెలికాఫ్టర్ ఇంటర్ సర్వీసులు

flyblade helicopter
కర్నాటక రాష్ట్రంలో ఇంటర్ సిటీ హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైబ్లేడ్ ఇండియా అనే కంపెనీ హంచ్ వెంచర్స్, బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ సంస్థలతో కలిసి ఈ సేవలను ప్రారంభించింది. బెంగుళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం, హోసురులోని ఏరోడ్రోమ్‌ల మధ్య ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ సేవలు పొందగోరువారు ఒక్కో వ్యక్తి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
 
కర్నాటక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి హోసూరు ఎరోడ్రోమ్ వరకు రోడ్డు మార్గంలో మూడు గంటల పాటు ప్రయాణ సమయం పడుతుంది. ఈ హెలికాప్టర్ అయితే‌ కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. 2019 బ్లేడ్ ఇండియా సేవలను ప్రారభించగా, దశల వారీగా విస్తరిస్తూ వస్తుంది. ఇప్పటికే ముంబై, పూణె, షిర్డీల మధ్య ఈసేవలు అందుబాటులో ఉన్నాయి. ఇపుడు బెంగుళూరు ఎయిర్‌పోర్టు, హోసూరు ఎరోడ్రోమ్‌ల మధ్య కొత్తగా ప్రారంభించింది.