గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (12:06 IST)

39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చారు.. ప్రైవేట్ భాగాలను తాకారు..

operation
కోల్ కతాలోని ఓ ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. 39 ఏళ్ల మహిళా రోగికి మత్తు మందు ఇచ్చాక  సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 39 ఏళ్ల మహిళా రోగి కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో పిత్తాశయ శస్త్రచికిత్స చేయించుకుంది. 
 
ఆపరేషన్ థియేటర్‌లో కొంచెం మత్తులో ఉండగానే సిబ్బంది తన ప్రైవేటు భాగాలను తాకారని మహిళా రోగి ఆరోపించారు. ఈ మేరకు మహిళా రోగి పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 
 
స్పృహలోకి వచ్చిన తర్వాత తన శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గుర్తులను మహిళ గమనించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.