1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (11:04 IST)

ఫుట్‌బాల్ ఆడుతూ 16 ఏళ్ల విద్యార్థిని మృతి

Foot Ball
అమెరికాలో ఫుట్‌బాల్ ఆడుతూ 16 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. యూఎస్‌లో స్కూల్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా 16 ఏళ్ల విద్యార్థిని అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. స్టాండ్స్‌లోని ఓ నర్సు ఆమెకు సీపీఆర్‌ని అందించింది. హృదయ స్పందనను తిరిగి పొందడానికి డీఫిబ్రిలేటర్ కూడా ఉపయోగించబడింది.
 
అయితే ఆస్పత్రిలోని వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కుప్పకూలి 16 ఏళ్ల విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడం ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేసింది. లక్షలాది మంది ఈ వార్తను చూసి షాక్ అయ్యారు.