గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (19:08 IST)

గడ్డకట్టిన మంచులో న్యూడుల్స్ తిన్నాడు.. వీడియో వైరల్

Noodles
సోషల్ మీడియా పుణ్యంతో పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జేక్ ఫిషర్ అని పిలువబడే ఇన్‌స్టాగ్రామ్ హోల్డర్ ఇటీవల చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వీడియోను పంచుకున్నారు. అతని ముఖం, కనురెప్పలు, వెంట్రుకలపై కనిపించే మంచు స్ఫటికాలతో పాటుగా న్యూడుల్స్ తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
పడిపోయిన ఉష్ణోగ్రతల మధ్య నూడుల్స్ గిన్నెను తినడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో ద్వారా చూడొచ్చు. డిసెంబరు 28న షేర్ చేయబడిన వీడియో.. వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 41.2 మిలియన్ల వీక్షణలు, మిలియన్ లైక్‌లను సంపాదించింది.