శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:44 IST)

12 ఏళ్ల బాలుడు రిపోర్టర్‌గా మారితే?

School boy
School boy
జార్ఖండ్‌లోని భిఖియాచక్ గ్రామంలోని తన పాఠశాల అద్వానమైన పరిస్థితులను ప్రదర్శిస్తూ ఒక బాలుడు రిపోర్టర్‌గా మారాడు. నివేదికల ప్రకారం, తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, చేతి పంపు పరిస్థితిని చూపించడానికి 12 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ రిపోర్టర్‌గా అవతారం ఎత్తాడు. 
 
ఈ వీడియోలో బాలుడు తన పాఠశాలలో అద్వానమైన పరిస్థితిని ప్రదర్శిస్తూ రౌండ్లు చేయడం చూడొచ్చు. కర్ర, ఖాళీ కోక్ బాటిల్‌ను మైక్‌గా ఉపయోగించుకున్నాడు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.