శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (08:27 IST)

అల్లూరి జిల్లాలో బోల్తాపడిన ప్రైవేటు బస్సు - ముగ్గురి మృతి

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, సంగీత ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఒరిస్సా రాష్ట్రంలోని భవానీపట్నం నుంచి విశాఖపట్టణానికి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా ఒరిస్సాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.