బాలకృష్ణ అఖండ సీక్వెల్‌కు వచ్చే నెలలో ముహూర్తం!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలియందికాదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దేవాలయాల్లో అరాచకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను అఖండలో పెట్టామని సక్సెస్ మీట్‌లోనే బాలకృష్ణ వెల్లడించారు. అప్పుడే సీక్వెల్ వుంటుందని దర్శకుడు కూడా చెప్పారు. తాజా సమాచారం మేరకు అఖండ2కు వచ్చే నెల జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
సీక్వెల్‌లో కథ ఆసక్తిగా వుంటుందని వార్తలు వస్తున్నాయి. దేశాన్ని బాగు చేయాలంటే రాజకీయనాయకులేకాదు అఘోరాలు కూడా చేస్తారు. ఈలాంటి అఘోరా రాజకీయ అవతారం ఎత్తితే ఎలా వుంటుందనేది శివుని దూతగా వచ్చే బాలకృష్ణ ఎలా చేశాడు? అన్నది పాయింట్‌గా ఫిలింనగర్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌లోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.