గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (10:52 IST)

ఆసియా కప్ హాకీ టోర్నీ.. పాకిస్థాన్‌పై భారత్ విన్.. ట్రోఫీ కైవసం

Indo-pak
Indo-pak
ఒమన్‌లో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీలో పాకిస్థాన్‌ను ఓడించి భారత జట్టు విజేతగా నిలిచింది.
10వ జూనియర్ ఆసియా కప్ హాకీ మ్యాచ్‌లు ఒమన్‌లోని సలాలాలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్, భారత్ జట్లు తలపడ్డాయి. 
 
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ చివరి దశలో పాకిస్థాన్‌కు కొన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించాయి. కానీ భారత జట్టు దానిని చక్కగా అధిగమించింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 2-1 స్కోరుతో విజయం సాధించింది. 
 
దీంతో భారత జట్టు నాలుగోసారి ఆసియా కప్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంతకు ముందు భారత హాకీ జట్టు 2004, 2008, 2015లో ఆసియా కప్‌ను గెలుచుకుంది.