1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (11:00 IST)

భారత్ సంస్థలపై సైబర్ దాడుల ముప్పు పెంపు... సోనిక్‌వాల్

cyber attack
భారత్ సంస్థలపై సైబర్ దాడుల ముప్పు గణనీయంగా పెరిగిందని అమెరికా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్ వాల్ తాజాగా పేర్కొంది. 2022లో ఈ దాడుల సంఖ్య ఏకంగా 31 శాతం మేర పెరిగింది. భారత్‌ వంటి దేశాల్లో నిందితులు కొత్త టార్గెట్లను ఎంచుకుంటూ తమ పరిధిని విస్తరిస్తున్నారని సోనిక్‌వాల్ తెలిపింది. 
 
సైబర్ నేరగాళ్ల నేరరీతులపై అవగాహన పెంచుకుంటూ, దాడులను తిప్పికొట్టగలిగేలా నైపుణ్యాలను సంస్థలు అభివృద్ధి పరుచుకోవాలని సోనిక్‌వాల్ వెల్లడించింది.
 
కొత్త టార్గెట్ల కోసం నిరంతర అన్వేషణలో ఉంటున్న నిందితులు ఒకసారి విజయం సాధించాక పదే పదే అవే తరహా దాడులు చేస్తున్నారని సోనిక్ తెలిపింది.