జాతీయ స్థాయిలో ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్
శక పురుషుడు ఎన్ఠీఆర్ శతజయంతి ముగింపును పురస్కరించుకొని జాతీయ స్థాయిలో సినీ మరియు వివిధ రంగాలకు చెందిన వారిని సత్కరించే భారీ కార్యక్రమం చేపట్టిన "ఎఫ్ టీ పి సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక"లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. వది రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులను గుర్తించి ఇంతమంచి కార్యక్రమం నిర్వహించడం అంటే మామూలు విషయం కాదని ఆయన కితాబునిచ్చారు.
ఎన్ఠీఆర్ పై అభిమానంతో చైతన్య జంగా - వీస్ వర్మ పాకలపాటి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకున్న తమ్మారెడ్డి... ఈ వేడుక పోస్టర్ ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మాలయ మల్లిఖార్జునరావు, తోకాడ సూరిబాబు (రాజమండ్రి) పాల్గొన్నారు.