గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (08:43 IST)

అమెరికాలో భారత సంతతి యువకుడి దారుణ హత్య

crime scene
అమెరికాలో ఓ భారత సంతతి యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఫిలడెల్ఫియా నగరంలో ఈ దారుణం జరిగింది. 
 
మృతుడిని జూడ్ చాకోగా(21) గుర్తించారు. జూడ్ తల్లిదండ్రులు కేరళ వాస్తవ్యులు. 30 ఏళ్ల క్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. విద్యార్థి అయిన జూడ్ స్థానికంగా పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. 
 
కాగా..అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.