శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (12:00 IST)

రెండున్నర గంటల్లోపే 500 కిలోమీటర్లు.. ఎంకే స్టాలిన్ ట్వీట్

Bullet Train
Bullet Train
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జపాన్ రాజధాని టోక్యోకు 500 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఈ రకమైన సేవ భారతదేశ ప్రజలకు కూడా ప్రయోజనాలను తీసుకురాగలదని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన పర్యటనలో, ముఖ్యమంత్రి స్టాలిన్ జపాన్‌లో నివసిస్తున్న తమిళ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమిళ, జపాన్ భాషల మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పారు.
 
రైలు ప్రయాణంలో తన అనుభవాన్ని పంచుకుంటూ, ఒసాకా నుండి టోక్యోకి బుల్లెట్‌ రైలులో ప్రయాణించాను.  సుమారు 500 కి.మీల దూరాన్ని రెండున్నర గంటలలోపు కవర్ చేస్తుందని కొన్ని ఫోటోలతో పాటు ట్వీట్ చేశారు. అలాగే భారతదేశంలో బుల్లెట్‌ ట్రైన్‌కు సమానమైన రైల్వే సర్వీస్ ఉండాలి. ఇది డిజైన్ పరంగా మాత్రమే కాకుండా వేగం, నాణ్యతలో కూడా ఉండాలి. ఇది వెనుకబడిన, మధ్యతరగతి పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారి ప్రయాణాలను సులభతరం చేస్తుంది.. అంటూ ట్వీట్ చేశారు.