1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 మే 2023 (20:04 IST)

ఉత్తర కొరియా: బైబిల్‌తో కనబడ్డారు.. రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు

jail
ఉత్తర కొరియాలో కఠినమైన శిక్షలు వుంటాయనే సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాలో ముఖ్యంగా క్రైస్తవులు అత్యంత తీవ్రమైన శిక్షలకు గురవుతున్నారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇందులో భాగంగా బైబిల్‌తో పట్టుబడిన వారికి మరణ శిక్ష, వారి కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధిస్తున్నారని తెలిపింది. 
 
పసిబిడ్డలకు కూడా జీవిత ఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కొరియాలో క్రైస్తవులు, ఇతర మతాల వారు దాదాపు 70వేల మంది జైలుశిక్షను అనుభవిస్తున్నట్లు తెలిపారు. 
 
పరిస్థితి ఎంత దయనీయంగా వుందంటే  రెండేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉండటంతో, ఆ బాలుడితోపాటు మొత్తం కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఉత్తర కొరియాలో న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కొరియా ఫ్యూచర్ ప్రచురించిన నివేదికను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రస్తావించింది.