మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (13:21 IST)

నా కుమార్తె పేరు ఎవ్వరూ పెట్టకోకూడదు.. వారం లోపు మార్చేయండి..

KIm_Daughter
KIm_Daughter
తన కుమార్తె పేరు మరెవరికీ ఉండకూడదని, అలా ఎవరైతే తన కుమార్తె పేరు పెట్టుకున్నారో వారంలోగా ఆ పేరును మార్చాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె పేరు జు ఏ. 
 
తన కూతురు పేరు వేరే అమ్మాయికి పెట్టకూడదని, ఆ పేరు ఉన్నవాళ్లు వారం రోజుల్లోగా పేరు మార్చుకోవాలని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఇప్పటికే దేశాధినేతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడంపై నిషేధం ఉండగా.. ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడి కుమార్తె పేరు ఎవరికీ పెట్టకూడదని ఉత్తరకొరియా ఆదేశాలు జారీ చేసింది.