మళ్లీ క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టింది. సౌత్ కొరియా ఆంక్షలను బేఖాతర్ చేస్తూ క్షిపణి పరీక్షలు చేసింది. గురువారం ఉదయం 7.48 గంటలకు జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరోవైపు మియాగి, యమగటీ, నీగాటా ప్రాంతాల్లో నివాసితుల ఇళ్లలోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన అరగంట తర్వాత అి జపాన్ భూభాగాన్ని దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్ళిందని జపాన్ ప్రభుత్వం, జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపాయి.