గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

31 నుంచి విజయవాడ నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

gannavaram airport
విజయవాడ నుంచి షార్జా వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపనుంది. 31వ తేదీ సోమవారం సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ నుంచి షార్జాకు తొలి విమాన సర్వీసు బయలుదేరి వెళ్లనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ చార్జీ ప్రారంభ ధర రూ.13,669గా నిర్ణయించారు. 
 
అయితే, షార్జా నుంచి విజయవాడకు వచ్చేందుకు మాత్రం రూ.8,946గా నిర్ణయించింది. యూఏఈ దేశాలైన దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు ఈ డైరెక్ట్ విమాన సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్ కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును నడుపుతుందని ఆయన వివరించారు.