బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:37 IST)

ఉద్యోగులకు తీపి కబురు... రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్

incometax
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏడు లక్షల వరకు ఆదాయం కలిగిన ఉద్యోగులు ఇకపై ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 
అన్ని మినహాయింపులతో కూడుకుని రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఊరట కలిగిస్తూ, ఆదాయ పన్ను రిబేటును విస్తరిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
tax slabs
 
ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. 
 
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని... రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. 
 
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.... రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను... రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.